మీకు ఇంగ్లీష్‌ అర్థం కాదా షర్మిలకు రోజా కౌంటర్‌

2024-11-29 15:17:22.0

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్న షర్మిలకు వైసీపీ నేత రోజా కౌంటర్‌ ఇచ్చారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/29/1382122-roja.webp

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్న షర్మిలకు వైసీపీ నేత రోజా కౌంటర్‌ ఇచ్చారు. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న‌ రెండు భాష‌ల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివ‌రాలు ఇచ్చారు. అయినా స‌రే ఓ పేపర్‌లో రాసిన స్టోరీలో పాయింట్లు ప‌ట్టుకుని మీరు మ‌ళ్లీ ఒక వితండ‌వాద‌న‌తో వైసీపీ అధినేత జగన్‌పై బురద జల్లుతున్నారని రోజా మండిపడ్డారు.

షర్మిల చేస్తున్న రాజకీయాలు, వాదనలు, ఎత్తుగడలు, విమర్శలు.. అన్నింటిని లక్ష్యం ఒక్కటేనని, కానీ, ఎట్టి పరిస్థితుల్లో జరగదని అన్నారామె. అలాగే.. జగన్‌ రాజకీయ పతనం గురించి ఎవరు ఎంత కోరుకున్నా.. ప్రజలు మాత్రం ఆయనకు అండగా ఉంటారని రోజా చెప్పారు. ఈ క్రమంలో.. సెకి ఒప్పందం గురించి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన మీడియా సమావేశం తాలుకా సారాంశాన్ని రోజా తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు.