http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/Intelligent.jpg
2016-02-06 03:03:11.0
తెలివితేటలు మనిషికి ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతుంటాయి. కానీ ఎక్కువకాలం బతకడానికి కూడా తెలివితేటలు ఉపయోగపడతాయి అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక నూతన అధ్యయనం అదే చెబుతోంది. మీ ఐక్యూ ఎక్కువుంటే హాయిగా కలకాలం బతికేస్తారని హామీ ఇస్తోంది. ఎడింబర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏ జన్యువయితే మనుషుల్లో తెలివితేటలకు కారణం అవుతుందో అదే జన్యువు వారిలో అనారోగ్యాలనుండి రక్షించుకునే శక్తిని పెంచుతుందని వారు చెబుతున్నారు. జ్ఞాపక శక్తితో పాటు మేధస్సుకి సంబంధించిన శక్తి సామర్ధ్యాలు ఎక్కువగా […]
తెలివితేటలు మనిషికి ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతుంటాయి. కానీ ఎక్కువకాలం బతకడానికి కూడా తెలివితేటలు ఉపయోగపడతాయి అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక నూతన అధ్యయనం అదే చెబుతోంది. మీ ఐక్యూ ఎక్కువుంటే హాయిగా కలకాలం బతికేస్తారని హామీ ఇస్తోంది. ఎడింబర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏ జన్యువయితే మనుషుల్లో తెలివితేటలకు కారణం అవుతుందో అదే జన్యువు వారిలో అనారోగ్యాలనుండి రక్షించుకునే శక్తిని పెంచుతుందని వారు చెబుతున్నారు. జ్ఞాపక శక్తితో పాటు మేధస్సుకి సంబంధించిన శక్తి సామర్ధ్యాలు ఎక్కువగా ఉన్నవారిలో పలు అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఒక జన్యువు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ జన్యువు అధిక రక్తపోటు, మతిమరుపు, మధుమేహం లాంటి అనారోగ్యాలను కలిగించి, అసలు సాధారణ ఆరోగ్యస్థాయినే తగ్గించి వేస్తుంది.
అయితే సాధారణ ఆరోగ్యస్థాయి చక్కగా ఉన్నవారిలో తెలివితేటలు బాగా ఉంటాయనే విషయం ఇప్పటికే పరిశోధనల్లో రుజువైంది. దీనికి, తాము చెబుతున్న విషయానికి సంబంధం ఉన్నసంగతిని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. అంటే ఆరోగ్యముంటేనే తెలివితేటలు ఉంటాయి…లేదా తెలివితేటలు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు…ఈ రెండూ పరస్పరాధారితాలన్నమాట.
జీన్స్‌కి తెలివితేటలకు ఉన్న సంబంధంపై శాస్త్రవేత్తలు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించారు. మనుషుల పొడవుని పెంచే జీన్స్, వారిని విద్యావంతులుగా చేసేందుకు సైతం దోహదం చేస్తున్నదట. పైగా అలాంటి సూపర్ జీన్స్ ఉన్నవారి మెదళ్లు కాస్త పెద్దగా ఉన్నట్టుగా అధ్యయనంలో గమనించారు. అయితే తెలివితేటలున్నా కూడా తప్పించుకోలేని వ్యాధులు కొన్ని ఉన్నాయి. అవి స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఆటిజం.
Intelligent
https://www.teluguglobal.com//2016/02/06/smarter-you-are/