మీర్‌పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్

https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398300-vav.webp

2025-01-28 10:44:38.0

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తన భార్య వెంకట మాధవిని కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన సంగతి తెలిసిందే. ఎముకలను కాల్చి బూడిద చేసి చెరువులో పడేశాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆమె తల్లి సుబ్బమ్మతో కలిసి జనవరి 16న మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు.. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని గురుమూర్తి అంగీకరించాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించిన పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. అయితే హత్య జరిగిన ప్రాంతంలోని శాంపిల్స్‌తో గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి.

Meerpet murder case,Gurumurthy,Ranga Reddy District,Telangana police,DGP Jitender,CM Revanth reddy,Venkata Madhavi