2024-10-11 10:52:53.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368208-shruthi-indigo.webp
ఇండిగో ఎయిర్ లైన్స్ పై శృతిహసన్ అసహనం
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నటి శృతి హసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల వల్ల నాలుగు గంటల పాటు ఎయిర్ పోర్టులోనే ఇరుక్కుపోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. తనతో పాటు ఆ విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులంతా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తాను చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్లు చేసే వ్యక్తిని కాదని, నాలుగు గంటలకు పైగా ఎయిర్ పోర్టులో నిరీక్షించాల్సి రావడంతోనే పోస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ రెస్పాండ్ అయ్యింది. ముంబయిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులతోనే విమానం ఆలస్యం అయ్యిందని వివరణ ఇచ్చింది. శృతితో పాటు మిగతా ప్రచాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని ప్రకటించింది.
Actress Shruti Haasan,Indigo Airlines,Flight delay