ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించలేదు

 

2024-12-14 06:42:23.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/14/1385748-mohan-babu.webp

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్స్‌ వేదికగా మోహన్‌బాబు పోస్ట్‌

తనకు సంబంధించిన విషయాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సినీ నటుడు మోహన్‌ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంట్లో డాక్టర్ల సంరక్షణలో ఉన్నట్లు చెప్పారు.

జర్నలిస్టులపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళగా.. ఆయన ఇంట్లో లేరని నిన్న మీడియాలో ప్రచారం జరిగింది. ఆయన పరారీలో ఉన్నారని, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని ప్రచారం జరిగింది.తాజాగా మోహన్‌బాబు తన పోస్టులో ఈ వార్తలను ఖండించారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎం. రంజిత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19 తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. 

 

Mohan Babu said,False propaganda,Circulated,About Anticipatory bail,NOT been rejected,Manchu Manoj