ముందుకు సాగేనా?

2023-03-15 07:32:33.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/15/726883-mundhuku.webp

కడలిదాటిన కెరటం..

కడ వరకు కడలికే స్వంతం..

ఎదను కదిపిన గాయం..

కన్నీటిలోనే నిరంతరం..

దేశాలు మారినా..

సముద్రాలు దాటినా..

ఆగనిది హృదయ వేదన..

విధాత వేసిన దండన..

ఎక్కడ ఉంటుంది మార్పు..

అదే మనసు నీతో ఉన్నప్పుడు..

ఆ శరీరమే నీదైనప్పుడు..

ఆ శోకం నిన్నే తాకినప్పుడు..

ప్రకృతి నిను మార్చునా..

మరపు సాధ్యమౌనా..

నీవులేని ఈ జీవితం..

నీ తలపుల తో నిరంతరం..

కరిగి నీరవుతోంది..

కన్నీరై ఆవిరౌతోంది..

-షామీర్ జానకీదేవి

(హైదరాబాద్)

Telugu Kavithalu,Shamir Janaki Devi