2025-02-15 09:05:42.0
తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోందని, త్వరలో రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని
సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం త్వరలో పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసందర్భంగా ఏది పడితే అది మాట్లాడే వాడిని కాదని, తాను చెప్పింది ఎన్నడూ తప్పు కాలేదని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోందని ముఖ్యమంత్రిపై 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. మొన్నటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షీని ఆయన మేనేజ్ చేస్తున్నారనే… అధిష్ఠానం ఇన్‌ఛార్జ్‌ని మార్చిందని ఆరోపించారు.
త్వరలో తనను కూడా సీఎం పోస్టు నుంచి పీకేస్తారనే భయంతోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ పెద్దల మెప్పు కోసమే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, ప్రధాని నరేంద్ర మోదీపై వరుసగా పదునైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సంచలన తీర్పు రాబోతోందని, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
CM Revanth Reddy,Errabelli Dayakar Rao,Deepa Das Munshi,Rahul Gandhi,Prime Minister Narendra Modi,Former CM KCR,Rahulgandhi,Dipadas Munshi