ముప్ఫై ఏళ్ల వయసులో మార్చుకోవాల్సినవి ఇవే!

https://www.teluguglobal.com/h-upload/2024/05/17/500x300_1328529-30-years-old.webp
2024-05-17 20:07:22.0

ముప్ఫై ఏళ్ల వయసుని యంగ్ ఏజ్‌గా చూస్తారు చాలామంది. కానీ, ఇప్పుడున్న లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల యంగ్ ఏజ్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు. వయసుతోపాటు పెరుగుతున్న అనారోగ్యాలే దీనికి కారణం. వీటి నుంచి బయటపడాలంటే ముప్ఫైల్లోకి రాగానే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి.

సాధారణంగా యాభై ఎళ్ల వయసులో వచ్చే అనారోగ్య సమస్యలన్నీ ఇప్పుడు ముప్ఫై ఏళ్లకే మొదలవుతున్నాయి. అందుకే ముప్ఫై ఏళ్ల వయసుని మధ్య వయసుగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. ముప్ఫైల్లోకి ఎంటర్ అవ్వగానే కొన్ని జాగ్రత్తలు మొదలుపెట్టాలంటున్నారు.

ముప్ఫై ఏళ్ల వయసుని యంగ్ ఏజ్‌గా చూస్తారు చాలామంది. కానీ, ఇప్పుడున్న లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల యంగ్ ఏజ్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు. వయసుతోపాటు పెరుగుతున్న అనారోగ్యాలే దీనికి కారణం. వీటి నుంచి బయటపడాలంటే ముప్ఫైల్లోకి రాగానే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. అవేంటంటే..

వ్యాయామాలు చేయమని డాక్టర్లు, ఆరోగ్య సంస్థలు ఎంతగానో మొత్తుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకూ చేయకపోయినా ముప్ఫై ఏళ్లలోకి ఎంటరయ్యాక తప్పక వ్యాయామం మొదలుపెట్టాలంటున్నారు డాక్టర్లు. లేకపోతే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

వయసు ముప్ఫై దాటుతుంటే డైట్‌లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, బేక్డ్ ఫుడ్స్ వంటివాటిని పూర్తిగా తగ్గించాలి. ముప్ఫైల్లో ఇవి చేసే హాని మరింత ఎక్కువ. కాబట్టి వాటిని మానుకోవాల్సిందే.

ముప్ఫైల్లో మాంసాహారాన్ని కూడా మితం చేయాలంటున్నారు డాక్టర్లు. పూర్తిగా మానుకోకపోయినా వారంలో ఒకసారికి పరిమితం చేస్తే మంచిది.

ముప్ఫైల్లో పూర్తిగా మానేయాల్సిన అలవాట్లలో స్మోకింగ్, డ్రింకింగ్ కూడా ప్రధానమైనవి. ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్‌స్టైల్‌కు ఇవి కూడా తోడైతే మరింత త్వరగా డయాబెటిస్, ఒబెసిటీ, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదముంది. కాబట్టి ముప్ఫైల్లో వీటిని మానుకుంటే మంచిది.

ముప్ఫైల్లోకి రాగానే ఒత్తిడికి చెక్ పెట్టే మార్గాలపై ఫోకస్ పెట్టాలి. ఒత్తిడి సమస్యను పట్టించుకోకపోతే అది లోలోపల ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. పైగా వయసుతోపాటు ఒత్తిడి పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి ముప్ఫైల్లోనే ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్ ఎలా గడపాలో ప్లాన్ చేసుకుంటే మంచిది.

30 Years Old,Lifestyle,Habits,Age
habits,free,age 30,lifestyle changes,bad habits, turning 30,relationships, telugu news, telugu global news

https://www.teluguglobal.com//health-life-style/what-changes-should-be-expected-when-you-hit-30-years-old-1031489