2015-05-04 01:13:04.0
ఈ శతాబ్దపు పోరు.. మహా యోధుల యుద్ధం, లోకమంతా తీవ్ర ఉత్కంఠ, బాక్సింగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్. ఇందుకు అమెరికాలోని లాస్‌వేగాస్ ఎంజీఎం స్టేడియం వేదికైంది. అమెరికా మహాబలుడు మేవెదర్, ఫిలిప్పిన్స్ జాతీయ హీరో ఫ్యాకీ మానియోపై విజయకేతనం ఎగరవేశాడు. 12 రౌండ్లపాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో జడ్జీలు మేవెదర్‌ను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ను 16 వేలమంది ప్రత్యక్షంగా, కోట్లాదిమంది టెలివిజన్ల ద్వారా వీక్షించారు. ఈ మ్యాచ్ ద్వారా విజేత మేమెదర్ రూ.1100కోట్లు గెలుచుకున్నాడు. […]
ఈ శతాబ్దపు పోరు.. మహా యోధుల యుద్ధం, లోకమంతా తీవ్ర ఉత్కంఠ, బాక్సింగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్. ఇందుకు అమెరికాలోని లాస్‌వేగాస్ ఎంజీఎం స్టేడియం వేదికైంది. అమెరికా మహాబలుడు మేవెదర్, ఫిలిప్పిన్స్ జాతీయ హీరో ఫ్యాకీ మానియోపై విజయకేతనం ఎగరవేశాడు. 12 రౌండ్లపాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో జడ్జీలు మేవెదర్‌ను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ను 16 వేలమంది ప్రత్యక్షంగా, కోట్లాదిమంది టెలివిజన్ల ద్వారా వీక్షించారు. ఈ మ్యాచ్ ద్వారా విజేత మేమెదర్ రూ.1100కోట్లు గెలుచుకున్నాడు. పాకియోకు రూ.700 కోట్లు దక్కాయి. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన కెన్నీ బాలీస్కు రూ.16 లక్షలు చెల్లించారు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఓ మ్యాచ్ రిఫరీకి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి. మొత్తానికి ముష్టి ఘాతాలకూ వేట కోట్లు కురవడం ద్వారా ఈ మ్యాచ్ శతాబ్దపు పోరుగా చరిత్రలో నిలిచిపోయింది.
World Boxing event