https://www.teluguglobal.com/h-upload/2023/09/11/500x300_823205-these-are-the-precautions-to-be-taken-in-order-not-to-reach-old-age.webp
2023-09-11 05:27:41.0
ఎంత ఏజ్ వచ్చినా కొందరూ స్మార్ట్‌గా యంగ్‌గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర. తగినంత నిద్ర ముఖాన్ని కాంతివంతంగా, యవ్వనంగా చేస్తుంది.
“వీడు ముసలోడు అవ్వకూడదే“ ఉప్పెన సినిమాలో బేబమ్మ చెప్పిన డైలాగ్ ఇది. కానీ, పాపం చాలామంది ఏజ్ పరంగా చిన్నవాళ్లే అయినా చూస్తే వయసు ముదిరిన వాళ్ళలానే కనిపిస్తారు. నిజంగానే వృద్ధాప్యం రాకుండా ఉండేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, అవి పక్కన పెడితే మనలో తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.. అవేంటంటే..
ఎంత ఏజ్ వచ్చినా కొందరూ స్మార్ట్‌గా యంగ్‌గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర. తగినంత నిద్ర ముఖాన్ని కాంతివంతంగా, యవ్వనంగా చేస్తుంది. నిద్ర లేమి వివిధ రకాల వ్యాధులు అటాక్ చేసేందుకు ఒకరకంగా కారణమవుతుందట.
నిద్ర మన జీర్ణవ్యవస్థపై కూడా అత్యంత ప్రభావం చూపుతుంది. కంటినిండా నిద్ర ఉంటే జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురుకావని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటన్నింటిని తేలిగ్గా తీసుకుని ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. వేళకి భోజనం, కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచి నిద్ర అలవాటుగా చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. దీనివల్ల జీవక్రియలు మెరుగుపడటం, వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుంది.
ఎందుకంటే సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్, మధుమేహం, గుండెబ్బులు వంటి రోగాలబారిన పడే అవకాశం ఉంది.
మనం తినే ఆహార పదార్థాలకూ, మన శరీర ఆరోగ్యానికీ సంబంధం ఉంటుందన్న విషయం తెలిసిందే. యవ్వనం నుంచే సరైన ఆహారం తింటూ ఉంటే త్వరగా ముసలితనం రాదు. అనారోగ్యాలు దరిచేరవు.
ఇంకా ధూమపానం, ఆల్కహాల్ తదితర చెడు అలవాట్లను, వదిలేయటం, మితిమీరి ఆహరం అందులోనూ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఇంక మీరు నిజంగానే ముసలోళ్ళు అవ్వరు.
Precautions,Order,Reach,Old Age,Face,Sleep,Food
Precautions, Order, Reach, Old Age, Face, Sleep, Food,
https://www.teluguglobal.com//health-life-style/these-are-the-precautions-to-be-taken-in-order-not-to-reach-old-age-960731