2025-02-17 10:20:10.0
రంజాన్ పండుగ సందర్బంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.
ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తమ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ఈ ముస్లిం ఉద్యోగాలు సా.4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
Ramzan,Muslim Employees,Telangana Goverment,Chief Secretary Shantikumari,CM Revanth reddy,MP Asaduddin Owaisi,MLA Akbaruddin Owaisi