మూడో రోజూ ఆట వర్షార్పణం

https://www.teluguglobal.com/h-upload/2024/09/29/1364257-india-vs-bangladesh.webp

2024-09-29 09:36:59.0

వరుసగా రెండు రోజులు ఒక్క బాల్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దు

 

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్‌ మూడో రోజు ఆట బాల్‌ పడకుండానే రద్దయ్యింది. మ్యాచ్‌కు పిచ్‌ సిద్ధంగా ఉన్నదా? లేదా? అన్నే అంశంపై అంపైర్లు ఉదయం నుంచి పలుమార్లు పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి పరిశీలించాక మైదానం తడిగానే ఉండటంతో మూడోరోజు ఆటను రద్దు చేశారు. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్ట్‌ గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉన్నది.

వర్షం కారణంగా రెండో టెస్ట్‌ శనివారం బంతి పడకుండానే రద్దయిన విషయం విదితమే.సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటే మ్యాచ్‌ దాదాపు డ్రా కావడం ఖాయమంటున్నారు. అప్పుడు భారత డబ్ల్యూటీసీ పాయింట్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.బంగ్లాదేశ్‌ ప్రస్తుత స్కోరు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు. మొమినుల్‌ హక్‌ (40 నాటౌట్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (6 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 2, అశ్విన్‌ 1 వికెట్‌ పడగొట్టారు.