మృతదేహానికి చికిత్స: మంత్రి దామోదర సీరియస్‌

2025-02-10 08:33:28.0

మంత్రి దామోదర ఆదేశాల మేరకు ఆస్పత్రికి చేరుకొని తనిఖీలు ఆరోగ్యశాఖ అధికారులు

నగరంలోని మదీనాగూడ సిద్ధార్థ ఆస్పత్రి తీరుపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో రెండు రోజులు మృతదేహానికి చికిత్స చేసినట్లు మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు. మంత్రి దామోదర ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు, వైద్యులు బృందం ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్నారు. 

Treatment of dead body Minister Damodara Raja narsimha,Serious over the issue,Health department,Inspected In Hospital