మెగాస్టార్‌‌కి అక్కినేని జాతీయ అవార్డు

 

2024-09-20 13:45:01.0

https://www.teluguglobal.com/h-upload/2024/09/20/1361270-mega-ster.webp

మెగాస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్‌ 28న అమితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్‌‌కి అవార్డును అందజేయనున్నారు.

అక్కినేని జాతీయ అవార్డుకు మెగాస్టార్ చిరంజీవి ఎంపికయ్యారు. ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో హీరో నాగార్జున ప్రకటించారు. ఆక్టోబర్ 28న ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఉంటుందని నాగ్ తెలిపారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నేర్పించారన్నారు. ఈ వారాంతంలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతోందని.. అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారన్నారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదన్నారు. రెండేళ్లకోసారి ఏఎన్నాఆర్‌ అవార్డులు ఇస్తున్నామని.. ఈ సారి మెగాస్టార్‌కి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.

అక్కినేని శత జయంతి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. నట కీరిటి సినీ రంగానికి చెందిన ప్రముఖుడు, ఏఎన్నార్ చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మనస్సులలో చిరస్మరణీయంగా ఉన్నారని చిరు ఎక్స్ వేదికంగా తెలిపారు. మెకానిక్ అల్లుడు సినిమా ద్వారా ఆయనతో నటించే అవకాశం దక్కడం అదృష్టం భావిస్తున్నని చిరు తెలిపారు. ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తానని మెగాస్టార్‌.. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

 

Megastar Chiranjeevi,Akkineni National Award,ANNAR centenary,Hero Nagarjuna,Annapurna Studio,Amitabh Bachchan,Mekanik alluḍu movie