2025-03-14 05:16:04.0
సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయం
టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకుపైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు.
పునాదిరాళ్లు మూవీతో అరంగేట్రం చేసిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి)కెరీర్‌లో ప్రారంభంలో అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నారు. స్టేట్ రౌడీ మూవీ నాటికి సుప్రీం హీరోగా.. తన డ్యాన్సులు, నటన, కామెడీతో మెగాస్టార్‌గా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ముఖ్యంగా డ్యాన్స్‌తో మెగాస్టార్ తన మార్క్ చూపెట్టి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టారు. 9 ఫిలంఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో విద్మవిభూషన్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 సాంగ్స్.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ట డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతున్నది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.
Another rare honor,Megastar Chiranjeevi,Lifetime Achievement Award,UK Parliament,Distinguished services to the film industry