మెగా హీరోపై అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

 

2024-11-21 15:48:56.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/21/1379834-ram-charan.webp

సినీ నటుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి దీక్షలో ఉండి కడప దర్గాను దర్శించడంపై అయ్యప్పస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెగా హీరో రామ్ చరణ్ పై శంషాబాద్ లో అయ్యప్పస్వాములు పోలీసులకు కంప్లైంట్ చేశారు. గ్లోబల్ స్టార్ తన చర్యల ద్వారా అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉండి కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైంది. మాలధారణ దుస్తుల్లో ఉన్న రామ్ చరణ్ కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దాంతో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాల ధారణ చేసి, దీక్షలో ఉండి దర్గాకు ఎలా వెళ్లారని తెలంగాణ అయ్యప్పల ఐక్యవేదిక రామ్ చరణ్ ను ప్రశ్నించింది. అంతేకాదు హిందువులకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రామ్ చరణ్ కు అయ్యప్ప మాల వేసిన గురుస్వామి ఆయనకు అయ్యప్ప దీక్ష విషయంలో జ్ఞానోదయం కల్పించాలని పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే, బాబాయ్ బాటలో నడవాల్సిన రామ్ చరణ్ అందుకు భిన్నంగా అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లారని వారు అన్నారు.

 

Ayyappa Swamy,Mega Hero,Ram Charan,Kadapa,Amin Peer Dargah,Pavan kalyan,Mega fans chiranjeevi