2018-09-19 17:38:31.0
ఆడపిల్లల్లో రుతుక్రమం మొదలయ్యే వయసు ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో ఉన్న చిన్నారులు కూడా ఈ దశలోకి ప్రవేశిస్తున్నారు. మానసిక పరిణితి రాకపోక ముందే మెచ్యూర్ అవడం వలన ఈ చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కంటే నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, సామాజిక అంశాలు ఇవన్నీ కలిసి ఆడపిల్లలను ఇలాంటి స్థితిలోకి నెట్టేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వీరు చెబుతున్నకారణాలు ఇలా ఉన్నాయి– –అనారోగ్యకరమైన ఆహారపు […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/periods.gif
ఆడపిల్లల్లో రుతుక్రమం మొదలయ్యే వయసు ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో ఉన్న చిన్నారులు కూడా ఈ దశలోకి ప్రవేశిస్తున్నారు. మానసిక పరిణితి రాకపోక ముందే మెచ్యూర్ అవడం వలన ఈ చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కంటే నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, సామాజిక అంశాలు ఇవన్నీ కలిసి ఆడపిల్లలను ఇలాంటి స్థితిలోకి నెట్టేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వీరు చెబుతున్నకారణాలు ఇలా ఉన్నాయి–
–అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి వ్యాయామం లేకపోవడం వలన పిల్లలు అధిక బరువుకి గురవుతున్నారు. ఇది కూడా అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ కావడానికి కారణంగా మారుతున్నది.
–హార్మోన్లు, యాంటీ బయోటెక్స్తో తయారయిన ఫారం కోళ్లు, గుడ్లు లాంటివి తినటం. జన్యుపరమైన మార్పులు చేర్పులతో ఉత్పత్తవుతున్న కూరగాయలు తినటం
–రసాయనాలు కలిసిన ఆర్గానిక్ సింథటిక్స్తో తయారయిన ప్లాస్టిక్ బ్యాగులు, ప్యాకింగులు, బాటిల్స్ లో ఉన్న ఆహారం, ద్రవ పదార్థాలను తీసుకోవటం
–పంటలకోసం వాడుతున్న పురుగుమందులు
–పిల్లల్లో పెరుగుతున్న ఒత్తిడి. సమస్యలు, మనస్పర్థలు ఉన్న వాతావరణంలో పెరుగుతుండటం
–గర్భవతులుగా ఉన్నపుడు సోయాకు సంబంధించిన ఆహారం ఎక్కువగా తీసుకున్నా పుట్టే పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు.
ఏది ఏమైనా మనుషులు ప్రకృతికి ఎంత దూరంగా వెళితే…వారిలోని సహజ ప్రకృతి అంతగా దెబ్బతింటుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.
period cycle,women period cycle