2025-01-29 03:27:30.0
రెండు గంటలుగా ట్రాక్ పైనే నిలిచిపోయిన పలు రైళ్లు
ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లకు ఉదయాన్నే బయల్దేరిన వారికి హైదరాబాద్ మెట్రో రైల్ షాక్ ఇచ్చింది. కారణాలేమిటో తెలియదు కానీ బుధవారం ఉదయం నుంచి నాగోల్ నుంచి రాయదుర్గం నడపాల్సిన మెట్రై రైల్ సర్వీసులను తార్నాక మెట్రో స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తోంది. దీంతో నగర వాసులతో పాటు వివిధ పనులపై ఉప్పల్ రింగ్ రోడ్డుకు చేరుకొని అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాలనుకునే ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. నాగోల్ నుంచి మెట్రో రైల్ ఎందుకు నడపడం లేదనే దానిపై ఆయా మెట్రో స్టేషన్లలో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఒక్క నాగోల్ రాయదుర్గం రూట్‌లోనే కాదు ఎల్‌బీ నగర్ మియాపూర్ రూట్‌లోనూ సాంకేతిక సమస్యతో మెట్రో రైళ్లు నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయా రూట్లలో వెళ్లాల్సి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు రెండు గంటలుగా నిలిచిపోయాయని చెప్తున్నారు. పలు మెట్రోరైళ్లు ట్రాక్‌పైనే నిలిచిపోయాయని.. వాటిని పునరుద్దరించేందుకు గంట వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Metro,Technical Issue,Trains Stopped,Passengers are suffering,Since 2 Hours,HMR