https://www.teluguglobal.com/h-upload/2023/11/23/500x300_860862-neck-pain.webp
2023-11-23 17:19:27.0
ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. ఫోన్ పట్టుకొని రిప్లై ఇచ్చిన తరువాత అలా అలా ఇంస్టాగ్రామ్ , ట్విటర్, రీల్స్, మరో గంటసేపు వీడియోలు చూస్తూ సమయాన్ని గడిపేసారా.. ఇలాంటివి చేస్తే మీ వేళ్లు నొప్పిగా ఉండకపోవచ్చు. కానీ అలా స్క్రీన్‌పై చూసేందుకు గడిపిన సమయంలో మెడనొప్పి రావడం ఖాయం.
ఈ మధ్యకాలంలో చాలామందిని లో మెడనొప్పి సమస్య వేధిస్తోంది. జీవనశైలి లో ఎటువంటి చిన్న మార్పులు వచ్చినా లేదా జాబ్ లో ఒత్తిడి కాస్త ఎక్కువైనా మెడ నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నిద్రలోంచి మేల్కొనగానే ఇలాంటి సమస్య ఎదురైందంటే.. రాత్రి పడుకునే భంగిమలో తేడా ఉండి ఉండచ్చని కాస్త సమయం ఇస్తే సమస్య అదే పోతుందని తేలికగా ఆలోచించకండి. ప్రతీసారీ సమస్య చిన్నదై ఉండదు. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో ఆలోచించండి.
ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. ఫోన్ పట్టుకొని రిప్లై ఇచ్చిన తరువాత అలా అలా ఇంస్టాగ్రామ్ , ట్విటర్, రీల్స్, మరో గంటసేపు వీడియోలు చూస్తూ సమయాన్ని గడిపేసారా.. ఇలాంటివి చేస్తే మీ వేళ్లు నొప్పిగా ఉండకపోవచ్చు. కానీ అలా స్క్రీన్‌పై చూసేందుకు గడిపిన సమయంలో మెడనొప్పి రావడం ఖాయం. దీనినే టెక్ నెక్ అని పిలుస్తారు. టెక్ నెక్ అనేది స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర హ్యాండ్‌హెల్డ్ పరికరంలోకి చూస్తూ మెడను అలా ఉంచేయడం వల్ల కలిగే పరిస్థితి. ఇది మెడ, వీపు, చేతులపై ఒత్తిడిని పెంచుతుంది. ఫోన్‌ని కిందకి చూడటం మొదట్లో పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, అది మెడపై కలిగించే ఒత్తిడి రాను రాను తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మామూలుగా ఇది మనం పెద్దగా పట్టించుకోని విషయం.

మారుతున్న కాలంతో ఇదో ఒక సాధారణ సమస్యగా మారింది, ఎందుకంటే ఇప్పటి జనాభాలో సుమారు సగానికి పైగా వ్యక్తులు ఆడ, మగా, చిన్నా పెద్దా ఎలా దేనితోనూ సంబంధం లేకుండా మెడ నొప్పిని కలిగి ఉంటారు. అలా అని ఈనొప్పి ఎప్పుడూ మెడలోనే కేంద్రీకృతమై ఉండదు. శరీరం అంతటా ప్రసరిస్తుంది, భుజాలు, చేతులు, ఛాతీపై ప్రభావం చూపుతుంది.
దీని నుంచి ఉపశమనం పొందాలంటే మీరు మెడను నిలబెట్టే భంగిమ సరిగా ఉండేలా, మెడ మరీ కిందికి వంచకుండా చూసుకోవాలి. 10-15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వీలుంటే డెస్క్టాప్ వాడుకోవాలి. తప్పదు అనుకుంటే మొబైల్ స్టాండ్కు ఫోన్ ను పెట్టుకోవటం అలవాటు చేసుకుంటే తల మరీ వంచకుండా చూసుకోవచ్చు. అలాగే మెడ, భుజాలు, వెన్నెముకకు దన్నుగా ఉండే కండరాలను బలోపేతం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలతో మెడ నొప్పి ముప్పును తగ్గించుకోవచ్చు.
Neck Pain,Mobile Phone,Smartphone,Health Tips
suffering from neck pain, neck pain, mobile phone, Smartphone, Health, Health Tips, Telugu News, Telugu Global News, Latest News
https://www.teluguglobal.com//health-life-style/is-your-mobile-phone-causing-you-neck-pain-976193