https://www.teluguglobal.com/h-upload/2024/03/27/500x300_1313765-scrubs.webp
2024-03-27 15:11:01.0
మన ఇంట్లో సులభంగా దొరికే పంచదార, నిమ్మరసం, తేనెలను మిశ్రమం తో తయారు చేసుకొనే స్క్రబ్స్ లో పంచదార ముఖం , మెడపైనున్న మృతకణాలను తొలగిస్తుంది. ఇందులోని నిమ్మరసం మచ్చలకు, అలర్జీలకు చెక్ పెడుతుంది.
చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే ఏ వయసు వారికైనా సరే చర్మం జిడ్డుగా, నిర్జీవంగా, పొడిబారిపోవడం ఖాయం. ఫలితమే మొటిమలు, అలర్జీ వంటి సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్ చక్కటి మార్గమని చెబుతారు సౌందర్య నిపుణులు. అయితే వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పనిలేదు.. కేవలం మన వంటింట్లో ఉండే కొన్ని పదార్ధాలు చాలు. చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తాయి. కొన్ని మచ్చలను మాయం చేస్తాయి. తేమను, మెరుపును అంద చేస్తాయి. అటువంటి సహజసిద్ధమైన కొన్ని స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం రండి.
మన ఇంట్లో సులభంగా దొరికే పంచదార, నిమ్మరసం, తేనెలను మిశ్రమం తో తయారు చేసుకొనే స్క్రబ్స్ లో పంచదార ముఖం , మెడపైనున్న మృతకణాలను తొలగిస్తుంది. ఇందులోని నిమ్మరసం మచ్చలకు, అలర్జీలకు చెక్ పెడుతుంది. ఇక తేనె సహజతేమను అందిస్తుంది.

గ్రీన్‌టీ , పంచదార, ఆలివ్ ఆయిల్ తో చేసే స్క్రబ్స్ చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అలాగే గ్రీన్‌టీ మొటిమలకు చెక్ పెడుతుంది.
ఓట్స్ పొడి, పంచదార, ఆలివ్ నూనె కూడా మంచి కాంబినేషన్. ఓట్స్ స్క్రబ్‌లా పనిచేయడంతో పాటు చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది.. అలాగే అలర్జీలకు చెక్ పెడుతుంది.
కాఫీ, చక్కెర కలపి చేసే బాడీ స్క్రబ్ చర్మాన్ని ఎంతో మెరిపిస్తుంది. దీనికి రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, మూడు విటమిన్ ఇ కాప్సూల్స్ కలిపి గరుగ్గా ఉండే పేస్టులా చేసి శరీరానికి మసాజ్ చేస్తే అది శరీరాన్ని సున్నితంగా మార్చే బాడీ స్క్రబ్గా పని చేస్తుంది.
అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు, పావు కప్పు ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూను తేనె, మూడు టేబుల్ స్పూన్ల గర గరగా ఉండే చక్కెరతో చేసిన స్క్రబ్ చర్మంపై ఉండే మృతకణాలను, మలినాలను పోగొడుతుంది. అంతేకాదు చర్మానికి కావలసినంత మాయిశ్చరైజింగ్ ని కూడా అందిస్తుంది.
ఇక అన్నింటికన్నా ఈజీ స్క్రబ్ పంచడారకు తేనె లేదా నూనెను కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవటం. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మసాజ్ అందుతుంది. ఇలా ఓ 5 నిమిషాలపాటు రుద్దిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. నూనె లేదా తేనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అలాగే పంచదార మృతకణాలను తొలగించి మేనికి మెరుపును అందిస్తుంది.
చూశారుగా.. ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈజీగా స్క్రబ్ ఎలా తయారుచేసుకోవచ్చో! మరి, మీరూ వీటిని ట్రై చేసి మెరిసిపోండి..!

Homemade,Scrub,Face Scrub,Skin,Health Tips
Homemade, Scrub, Face Scrubs, Skin, Natural Glowing Skin, health, health tips, news, telugu news, telugu global news, latest health news, సహజ స్క్రబ్, పంచదార ముఖం, పంచదార, నిమ్మరసం, తేనె
https://www.teluguglobal.com//health-life-style/homemade-face-scrub-for-natural-glowing-skin-1014795