https://www.teluguglobal.com/h-upload/2025/01/05/1391803-accident.webp
2025-01-05 12:31:21.0
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన చెక్‌పోస్ట్ వద్ద ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఓ కుటుంబం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు కూతురు మృతి చెందింది.
ఈ ప్రమాదంలో వారి కుమారుడి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడి రెండు కాళ్లు విరిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Medchal district,road accident,Check post,CM Revanth reddy,DGP Jitender,Telangana police,Crime news,Telugu news,Telangana news