2025-02-17 16:06:19.0
వెంకటరమణ గొంతు కోసి హత్య చేసిన 16 ఏళ్ల బాలుడు
మేడ్చల్ మండలం కిష్టాపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. 16 ఏళ్ల బాలుడు తన సొంత మేనమామను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది. వెంకటరమణ గొంతు కోసి హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడు హత్యకు గురైన వ్యక్తి అక్కడ కొడుకే కావడం విశేషం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు.
A boy brutally murdered,Cut throat his uncle,The reason for this murder,Family feud