2024-11-21 08:18:54.0
https://www.teluguglobal.com/h-upload/2024/11/21/1379651-dhanush-iswarya.webp
చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు తెలిపిన నటుడు ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య
విడాకుల కేసు విచారణ సందర్భంగా నటుడు ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య తాజాగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ముందు హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి కారణాలు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది తీర్పును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఐశ్వర్య పెద్ద కుమార్తె. వయసులో ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దదనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ధనుష్ వాళ్ల అక్క, ఐశ్వర్య మంచి ఫ్రెండ్స్. అలా వీళ్లిద్దరి మధ్య ఫ్రెండిషిప్ కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18 వాళ్లు పెళ్లి చేసుకున్నారు.
అయితే 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడిపోవాలనుకుంటున్నామని సుమారు రెండేళ్ల కిందట ధనుష్-ఐశ్వర్య ప్రకటించిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
Dhanush Aishwarya divorce,Dhanush and Aishwarya,Appear before court,Decision to separate