మేలిమి ముత్యం

2023-11-07 07:29:24.0

https://www.teluguglobal.com/h-upload/2023/11/07/852371-melim.webp

ఆదర్శనీయుడు

మహితాత్ముడు

భావిపౌరులకు ఆదర్శంగా

నిలువగలిగిన మన మహాత్ముడు.

అర్ధం

నిస్వార్థం

అతని ప్రతి అణువులో

సమాజహితమే పరమార్థం.

వాగ్భూషణం

రవికిరణం

సామాన్యంగా జన్మించి అసామాన్యంగా ఎదిగిన రామబాణం.

గాంధీజయంతి

శ్వేతచామంతి

మనస్ఫూర్తిగా అర్పిద్దాం ఆయనకు

ఒక పూబంతి.

సత్యం

ఔన్నత్యం

భారతమాత ప్రపంచానికిచ్చిన

బహుమతి ఆ మేలిమిముత్యం.

– కోపూరి పుష్పాదేవి

Melimi Muthyam,Kopuri Pushpadevi,Telugu Kavithalu