మైనర్‌పై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు

2025-03-08 07:36:59.0

మైనర్‌ బాలికపై అత్యాచారానికి తెగబడి గొంతునులిమి హత్యచేయబోయిన నిందితుడు

త్రిపురలో మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన దోషికి 20 ఏళ్ల జైలు శిక్షపడింది. 2022లో చందన్‌ మాలీ అనే వ్యక్తి పక్కింటిలోకి వెళ్లి మైనర్‌ బాలికపై అత్యాచారానికి తెగబడినాడు. అనంతరం గొంతునులిమి హత్య చేయబోయాడు. బాలిక కేకలు విన్న ఆమె తల్లి అక్కడికి చేరుకున్నది. దీంతో చందన్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా.. దలాయ్‌ జిల్లా కోర్టు విచారించింది. శుక్రవారం అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Tripura man,Sentenced to 20 years of imprisonment,Kamalpur court in Dhalai district,Raping a minor girl.