2025-01-31 14:23:11.0
150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మార్చి 31 లోపు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసానిధులు జమచేసే పూచీ నాది అని అన్నారు. విద్య పై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్ పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో రూ.21వేల కోట్లు విద్యాశాఖ కోసం కేటాయించినట్టు తెలిపారు. మొగిలిగిద్దకు దాదాపు రూ.16కోట్లు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను విధానం చేపట్టింది.
గత ప్రభుత్వ విద్యాశాఖను నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం అధ్యాపకులు, వైస్ ఛాన్స్ లర్లను నియమించలేదు. గత పదేళ్లు విద్యాశాఖను నిర్వీర్యం చేశారు. మా ప్రభుత్వం 11వేల టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. మా ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గత ప్రభుత్వంలో సంవత్సరాల కొద్ది పరీక్షలు జరిగేవి కాదన్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచామని.. రూ.21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, జడ్పీటీసీలు నూటికి నూరు శాతం గెలిపించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ ఊరికి ఎంత రుణ మాఫీ చేశామో చెబుతామని సీఎం రేవంత్ అన్నారు.
Ranga Reddy District,Mogiligidda Government School,CM Revanth Reddy,Department of Education,Cgngress party,KCR,KTR,BRS Party,Technology Center