http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/Apple.gif
2016-04-04 05:11:01.0
చైనాలో అమ్మాయిలు అందం వ్యామోహంలో పడి తమ ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. రెండు మోకాళ్లను దగ్గరకు చేర్చి ఒక ఐఫోనుని మోకాళ్ల మీద పెడితే మోచిప్పలు కనిపించకుండా ఉండటం…తామెంత స్లిమ్‌గా ఉన్నారో తెలిపేందుకు సూచన అని…చైనా అమ్మాయిలు భావిస్తున్నారు. అలాంటి ఫొటోలు ఇప్పుడు అక్కడ వైరల్ అయిపోయాయి. దీన్ని వారు ఐఫోన్ 6 లెగ్స్ ఛాలెంజ్‌గా పిలుస్తున్నారు. అంతకుముందు ఒక ఎ ఫోర్ సైజు పేపరుతో తమ వీపు, నడుముని పూర్తిగా కనిపించకుండా చేస్తే …అలా ఉండటం […]
చైనాలో అమ్మాయిలు అందం వ్యామోహంలో పడి తమ ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. రెండు మోకాళ్లను దగ్గరకు చేర్చి ఒక ఐఫోనుని మోకాళ్ల మీద పెడితే మోచిప్పలు కనిపించకుండా ఉండటం…తామెంత స్లిమ్‌గా ఉన్నారో తెలిపేందుకు సూచన అని…చైనా అమ్మాయిలు భావిస్తున్నారు. అలాంటి ఫొటోలు ఇప్పుడు అక్కడ వైరల్ అయిపోయాయి. దీన్ని వారు ఐఫోన్ 6 లెగ్స్ ఛాలెంజ్‌గా పిలుస్తున్నారు. అంతకుముందు ఒక ఎ ఫోర్ సైజు పేపరుతో తమ వీపు, నడుముని పూర్తిగా కనిపించకుండా చేస్తే …అలా ఉండటం అత్యంత నాజూకుదనం గా భావించారు. అది ఎ ఫోర్ సైజ్ వెయిస్ట్ ఛాలెంజ్‌గా కొన్నాళ్లు హల్‌చల్ చేసింది. ఇప్పుడు మోకాళ్లని ఐ ఫోన్‌తో కవర్ చేసే ఛాలెంజ్‌ని తీసుకుని పలువురు తమ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది చైనా అమ్మాయిల సన్నదనం వ్యామోహానికి పరాకాష్ట అని, ఇది కూడా అనారోగ్యాలకు హేతువని అక్కడి ఆలోచనా పరులు హెచ్చరిస్తున్నారు. ఇదోరకంగా బాడీ షేమింగ్ ట్రెండ్‌గా వారు చెబుతున్నారు. దీని తరువాత ఇక ఏ శరీర భాగంతో చైనా అమ్మాయిలు ఛాలెంజ్ మొదలుపెడతారో కదా…అని చైతన్యాన్ని కోరుకునేవారు నిట్టూరుస్తున్నారు.
పాదాలను బంధించి పెరగకుండాచేసే సాంప్రదాయమొకటి అక్కడ పూర్వపు రోజుల్లో పాతుకుపోయి ఉండటం మనకు తెలిసిందే. చైనా మహిళలు ఆ సంప్రదాయాన్ని వ్యతిరేకించి ఎన్నో పోరాటాలు చేసి దాంట్లోంచి బయటపడగలిగారు. చిన్నపాదాలు అదృష్టమని సంపద తేస్తాయని భావించి మూఢ నమ్మకాలతో ఆ కాలంలో పాటించిన ఆచారమది. కానీ నేటి అమ్మాయిలు అందంమీది వ్యామోహంతో అంతకంటే అర్థమహితమైన పనులు చేస్తున్నారని వారి పెద్దలే విమర్శిస్తున్నారు.
Apple Phones
https://www.teluguglobal.com//2016/04/04/apple-phones/