మోడీని కలిసిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో

2025-03-18 12:01:55.0

మోడీజీతో ఎప్పటికీ మరిచిపోలేని సమావేశమిది. నా ‘సింఫొనీ-వాలియంట్‌’ సహా పలు అంశాలపై చర్చించామని సోషల్ మీడియాలో పోస్ట్‌

ప్రధాని మోడీని ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇళయరాజా సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. మోడీజీతో ఎప్పటికీ మరిచిపోలేని సమావేశమిది. నా ‘సింఫొనీ-వాలియంట్‌’ సహా పలు అంశాలపై చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతును కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు.

లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్‌’ పేరుతో మ్యూజికల్‌ ఈవెంట్‌ నిర్వహించిన విషయం విదితమే. లండన్‌లో వెస్ట్రన్‌ క్లాసికల్‌ సింఫొనీ నిర్వహించిన మొదటి ఆసియా మ్యూజిక్‌ కంపోజర్‌గా ఇళయరాజా రికార్డు సృష్టించారు. కొన్నిరోజుల కింద చెన్నై తిరిగొచ్చిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగీతానికి వయసతో సంబంధం లేదన్నారు. భవిష్యత్తులో 13 దేశాల్లో ‘వాలియంట్‌’ నిర్వహించనున్నారు.

తన సంగీతంలో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు మ్యాస్ట్రో. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మ్యూజిక్‌ మ్యాస్ట్రో 50 ఏళ్ల జర్నీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

Music maestro Ilaiyaraaja,met Prime Minister Narendra Modi,Composer stated that,They spoke about many things,Including his symphony debut in London