మోడీ ప్రభుత్వం నెలరోజుల్లోపే కూలిపోతుంది

https://www.teluguglobal.com/h-upload/2024/07/06/500x300_1342002-former-cm-lalu-prasad-yadav-predicts-the-modi-government-can-fall-by-august.webpTelugu Global

ఆగస్టులో పతనమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా లాలూ సూచించారు.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారు బలహీనంగా ఉందని, అది నెలరోజుల్లోపే కూలిపోతుందని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. పాట్నాలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం బలహీనంగా ఉందని, ఏ క్షణమైనా అది కూలిపోవచ్చని ఆయన చెప్పారు. ఆగస్టులో పతనమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా లాలూ సూచించారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే లాలూ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయన పగటి కలలు కంటున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలు మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పాయన్నారు. మోడీ మార్గనిర్దేశంలో, సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో బిహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలను ఓడిస్తుందని చెప్పారు.

Bihar,Former CM,Lalu Prasad Yadav,Predicts,Modi government,Fall,August