2025-02-15 12:58:27.0
సీఎం రేవంత్ వ్యాఖ్యలు తప్పేనని చెప్పిన పీసీసీ చీఫ్
https://www.teluguglobal.com/h-upload/2025/02/15/1403767-mahesh-kumar-goud-1.webp
ప్రధాని నరేంద్రమోదీ కులం ”గన్సీ”ని 1994లోనే అప్పటి గుజరాత్ ప్రభుత్వం బీసీల్లో చేర్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పీసీసీ చీఫ్ వివరణ ఇచ్చే ప్రయత్నంలో రేవంత్ చెప్పింది తప్పేనని పరోక్షంగా ఒప్పుకున్నారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారే తప్ప బీసీ కాదని అనలేదని గుర్తించాలన్నారు. మోదీ ప్రధాని అయినా దేశంలోని ఓబీసీలకు చేసిందేమి లేదన్నారు. బండి సంజయ్ పుట్టుకతో ఓబీసీ అని.. మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. మోదీ గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో చేర్చారన్న రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ గురించి చెప్పకుండా పీసీసీ చీఫ్ జాగ్రత్త పడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాలను మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్తే ఆయనది ఏం కులమో చెప్తారని అన్నారు.
Narendra Modi,Caste,Converted BC,Revanth Reddy Comments,PCC Chief,Mahesh Kumar Goud