http://www.teluguglobal.com/wp-content/uploads/2015/11/Modi-Gold-Scheme.jpg
2015-11-19 20:57:07.0
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ స్కీమ్స్‌కు స్పందన రావడం లేదు. మోదీ స్వయంగా ఇటీవల ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కేవలం నాలుగు వందల గ్రాముల బంగారం మాత్రమే డిపాజిట్ అయింది. ఆభరణాలు, వజ్రాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జెజెఇపిసి) ఈ విషయాన్ని ప్రకటించింది. దేశంలో ప్రజల వద్ద 52 లక్షల కోట్ల రూపాయల విలువ గల 20 వేల టన్నుల బంగారం నిల్వలుండగా… కేవలం నాలుగు వందల గ్రాముల బంగారమే […]
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ స్కీమ్స్‌కు స్పందన రావడం లేదు. మోదీ స్వయంగా ఇటీవల ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కేవలం నాలుగు వందల గ్రాముల బంగారం మాత్రమే డిపాజిట్ అయింది. ఆభరణాలు, వజ్రాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జెజెఇపిసి) ఈ విషయాన్ని ప్రకటించింది. దేశంలో ప్రజల వద్ద 52 లక్షల కోట్ల రూపాయల విలువ గల 20 వేల టన్నుల బంగారం నిల్వలుండగా… కేవలం నాలుగు వందల గ్రాముల బంగారమే డిపాజిట్ అవడంతో కేంద్రం షాక్ అయింది.
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద అనుమతి పొందిన బ్యాంకులు 1 నుంచి 3 సంవత్సరాల స్వల్పకాల పరిమితి నుంచి 12 నుంచి 15 సంవత్సరాల దీర్ఘకాల పరిమితికి బంగారాన్ని డిపాజిట్‌గా తీసుకోవచ్చు. అలా సేకరించిన బంగారాన్ని బ్యాంకులు మార్కెట్‌లో విక్రయించవచ్చు లేదా ఆభరణాల వర్తకులకు, ఎంఎంటిసికి అందించవచ్చు. ఈ స్కీమ్ కింద బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి రెండున్నర శాతం వడ్డీ చెల్లిస్తారు. కావాలంటే వడ్డీని కూడా బంగారం రూపంలోనే తిరిగి చెల్లిస్తారు. అయితే ఈ పథకం సామాన్యులకు అనువైనది కాదన్న అభిప్రాయం ఉంది. దేశంలో బంగారం దిగుమతులను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
https://www.teluguglobal.com//2015/11/20/modi-gold-scheme-gets-just-some-grams-of-gold/