మోహన్‌బాబుతో ఆస్తి గొడవలపై నటి సౌందర్య భర్త క్లారిటీ

2025-03-12 14:41:59.0

మోహన్‌బాబుతో మాకెలాంటి ఆస్తి గొడవలు లేవు సౌందర్య భర్త క్లారిటీ ఇచ్చారు

టాలీవుడ్ సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబుతో తమకెలాంటి ఆస్తిగొడవలు లేవని దివంగత నటి సౌందర్య భర్త రఘు అన్నారు. సౌందర్య డెత్ ప్రమాదవశాత్తూ జరిగింది కాదంటూ ఆమెను పక్కాగా ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల నిరసనకు దిగారు. మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ ని కూడా తన అదుపులో ఉంచుకుని కలెక్షన్ కింగ్ అనుభవిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు స్పందించారు.

హైదరాబాద్ లోని ఒక ప్రాపర్టీ గురించి మోహన్ బాబు పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని రఘు చెప్పారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని అన్నారు. తన భార్య సౌందర్య ఆస్తులను మోహన్ బాబు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. మోహన్ బాబుకు, తమకు మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని అన్నారు. వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్‌బాబును ఎంతో గౌరవిస్తాని ఆయన తెలిపారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రఘును 2003లో సౌందర్య వివాహం చేసుకున్నారు. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున సౌందర్య ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్ కు బయల్దేరిన వెంటనే హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆమె సజీవదహనం అయ్యారు.

Mohan Babu,Soundarya,Khammam District,Jal Palli,Farm house,Karimnagar,BJP,Helicopter crash,Bangalore,CM Revanth reddy,KCR,KTR,BRS Party