మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

2024-10-08 07:58:47.0

మాడవీదుల్లో దర్శనమిచ్చిన మలయప్పస్వామి

https://www.teluguglobal.com/h-upload/2024/10/08/1367252-ttd-mohini-alankaram.webp

తిరులు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు (మంగళవారం) శ్రీ మలయప్పస్వామి మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయన పక్కనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. మంగళవారం ఉదయం మోహినీ అలంకారంలో శ్రీవారిని దర్శించుకొని భక్తులు ముగ్ధులయ్యారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తులు కోలాటాలు, భజనలతో స్వామి వారిని అనుసరించారు. ఈ సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌ స్వామి, ఈవో జె శ్యామలరావు, అద‌న‌పు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో శ్రీ‌ధ‌ర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.