2023-02-21 15:04:25.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/21/724008-maunam.webp
మౌనం ఓ మహా మంత్రం!
శతకోటి సమస్యలకు
కాసంత పరిష్కారమం
కనిపించని కారుచిచ్చు
నిండు సభలో వనిత
వలువలూడిన క్షణం
మౌనం దావానలమై
వంశ క్షయానికి ఓకారణమైంది
ఒక చోట మౌనం
అర్ధాంగీకారమైతే
మరో చోట మౌనం
వ్యాఖ్యానమైంది
ఒక మౌనం
కరుణా సముద్రం
ఒక మౌనం
కఠిన పాషాణం
ఒక మౌనం పరమళించేకుసుమం
ఒక మౌనం
కనిపించే ప్రకృతి
మాటలు రాక పోయినా మౌనమే
మనసు మూగపోయినా మౌనమే
మాటలేక పోయినా
మౌనమే
మనసు విరిగిపోయినా మౌనమే
ఒక మౌనం సహనం
ఒక మౌనం ప్రళయం
ఒక మౌనం ప్రణయం
ఒక మౌనం మనోహరం
మౌనం హిరణ్యమై
సత్వమై శోధిస్తోంది
మాట రజితమై
రజో భరితమైంది
– లలితా చండీ
Lalita Chandy,Maunam,Telugu Kavithalu