మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన బీజేపీ

2025-02-08 03:43:09.0

బీజేపీ 38, ఆప్‌ 24, కాంగ్రెస్‌ 1 స్థానంలో ఆధిక్యం

https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401451-delhi-assembly-elections.webp

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తున్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పోలీస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలు చూస్తుంటే.. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ (36) దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. ఆప్‌ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్‌ ఒక చోట ముందంజలో కొనసాగుతున్నది. 

Delhi Results 2025,ECI begins counting,AAP,BJP,Congress,Arvind Kejriwal,Parvesh Verma