2025-02-14 10:59:37.0
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, స్థలాల సేకరణ పై సమీక్ష నిర్వహించారు
తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్శించునున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యా శాఖ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, స్థలాల సేకరణ పై సమీక్ష నిర్వహించడం జరిగింది. వచ్చే రెండు సంవత్సరాలలో 105 నియోజకవర్గాల్లో పాఠశాలల నిర్మాణం పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అధునాతన సదుపాయాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరగా స్థలాలు గుర్తించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని అధికారులను సీఎం కోరారు. రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి విద్యాశాఖపై సమీక్షలో స్ఫష్టం చేశారు
CM Revanth reddy,Young India schools,Residential school,Chakali Ailamma Women’s University,Telanagana goverment,Department of Education,BRS Party,KCR,KTR