https://www.teluguglobal.com/h-upload/2023/01/26/500x300_720784-honda-activa-hybrid.webp
2023-01-26 10:04:57.0
Honda Activa Hybrid Electric Scooter: యాక్టీవా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందని ఇటీవల హోండా ప్రకటించింది.
మనదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే స్కూటర్స్‌లో హోండా యాక్టీవా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. యాక్టీవా 3జీ, 4జీ, 5జీ, 6జీ.. ఇలా లేటెస్ట్ వెర్షన్లతో ప్రతిఏటా స్కూటర్ మార్కెట్‌లో నెంబర్ 1 గా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడీ యాక్టీవా.. ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా రాబోతోంది. త్వరలోనే యాక్టీవా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందని ఇటీవల హోండా ప్రకటించింది.
హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతోంది. జనవరి 23న హోండా యాక్టీవా హైబ్రిడ్ మోడల్ లాంఛ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటీ హైబ్రిడ్ మోడల్‌లో ఉండబోతుందని టెక్ వర్గాల్లో టాక్.
అంటే ఇది పెట్రోల్‌తో నడుస్తుంది. అలాగే బ్యాటరీతో కూడా నడుస్తుంది. ఇందులో సరికొత్త రీజెనరేటివ్ టెక్నాలజీని ఉపయోగించి రీఛార్జ్ చేసేలా ప్రత్యేకమైన బ్యాటరీ ఉంటుంది. ఈ హైబ్రిడ్ మోడల్ కోసం హోండా ఏఐ టెక్నాలజీని వాడుతుంది. ఈ స్కూటర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
హైబ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు హోండా ఇంకా వెల్లడించలేదు. జనవరి 23న ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఈ స్కూటర్ ధర కాస్త పెరగొచ్చు.
Honda Activa,Activa Hybrid Electric,electric scooters
Activa 7G Price, Honda Activa, Activa Hybrid Electric, Honda Activa Hybrid Electric Scooter, Electric Scooter, Activa Hybrid, telugu news, telugu global news, latest telugu news, telugu global business, యాక్టీవా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, యాక్టీవా, యాక్టీవా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ స్కూటర్
https://www.teluguglobal.com//business/honda-activa-hybrid-electric-scooter-price-and-specifications-891787