యాక్సిస్ బ్యాంక్ పేమెంట్ డివైజ్.. ఎలా పని చేస్తుందంటే..

https://www.teluguglobal.com/h-upload/old_images/500x300_115163-axis.webp
2021-03-12 02:23:42.0

ఆన్ లైన్ పేమెంట్స్ ఇప్పుడు ఎంతగా వాడుకలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో కూడా ఇప్పుడో కొత్త టెక్నాలజీ వచ్చింది. అదేంటంటే.. మామూలుగా డిజిటల్ పేమెంట్స్ మొబైల్ తోనే చేసే వీలుంటుంది. అయితే ఇప్పుడు దానికీ ఓ ఆల్టర్నేటివ్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ సరికొత్త కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్‌లను లాంచ్ చేసింది. ఈ డివైజ్ లు నేరుగా కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు లింక్ అయి ఉంటాయి. ఈ వేర్ అండ్ పే యాక్సెసరీలు బ్యాండ్, కీ […]

ఆన్ లైన్ పేమెంట్స్ ఇప్పుడు ఎంతగా వాడుకలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో కూడా ఇప్పుడో కొత్త టెక్నాలజీ వచ్చింది. అదేంటంటే..

మామూలుగా డిజిటల్ పేమెంట్స్ మొబైల్ తోనే చేసే వీలుంటుంది. అయితే ఇప్పుడు దానికీ ఓ ఆల్టర్నేటివ్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ సరికొత్త కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్‌లను లాంచ్ చేసింది. ఈ డివైజ్ లు నేరుగా కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు లింక్ అయి ఉంటాయి.

ఈ వేర్ అండ్ పే యాక్సెసరీలు బ్యాండ్, కీ ఛెయిన్, వాచ్ ల రూపంలో ఉంటాయి. యూజర్లు పేమెంట్ చేయడానికి స్మార్ట్ ఫోన్లు, వాలెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వేరబుల్ డివైజ్ ను ధరిస్తే చాలు. కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ల కోసం ఈ వేరబుల్ డివైజ్ లు బాగా పనిచేస్తాయి.దీని ద్వారా ఐదు వేల రూపాయల వరకూ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేయాల్సి వస్తే.. పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డివైజ్ ధర రూ.750 నుంచి మొదలవుతుంది. దీనిని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచీల్లో పొందొచ్చు.

Axis bank,Device,Online Payment,Payment

https://www.teluguglobal.com//2021/03/12/axis-bank-payment-device-how-it-works/