యాదగిరిగుట్ట పరిశ్రమలో పేలుడు

https://www.teluguglobal.com/h-upload/2025/01/04/1391484-major-blast-in-yadagirigutta.webp

2025-01-04 05:43:21.0

8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.. ఒకరు మృతి

యాదగిరిగుట్ట మండలంలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌క్లూజివ్‌ పరిశ్రమలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆ ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. ఇంకొకరిని హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బచనపేటకు చెందిన ఎం. కనకయ్యగా గుర్తించారు. హైదరాబాద్‌కు తరలిస్తున్న వ్యక్తి ప్రకాశ్‌గా గుర్తించారు.భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బైటికి పరుగులు తీశారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అప్రమత్తం చేసింది. మిగిలిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరినీ పరిశ్రమలోకి అనుమతించకపోవడంతో ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. 

Major Blast in Yadagirigutta,8 workers seriously injured,Critical condition,Premier Exclusive Industry,One Died