యాపిల్ ప్రొడక్ట్స్‌పై దీపావళి ఆఫర్లు!

https://www.teluguglobal.com/h-upload/2023/10/17/500x300_842171-apple-products.webp
2023-10-18 03:20:59.0

దీపావళి స్పెషల్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా యాపిల్ కంపెనీ.. అన్ని యాపిల్ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్ 15తో పాటు మ్యాక్ బుక్ , ఐపాడ్స్‌పై కూడా మంచి డీల్స్ అనౌన్స్ చేసింది.

ఈ పండుగ సీజన్‌లో ఐఫోన్ కొనాలనుకునే వాళ్లకి యాపిల్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. యాపిల్ ప్రొడక్ట్స్‌పై స్పెషల్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..

దీపావళి స్పెషల్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా యాపిల్ కంపెనీ.. అన్ని యాపిల్ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్ 15తో పాటు మ్యాక్ బుక్ , ఐపాడ్స్‌పై కూడా మంచి డీల్స్ అనౌన్స్ చేసింది.

డిస్కౌంట్‌లో ఐప్యాడ్స్

యాపిల్ దీపావళి సేల్‌లో టాబ్లెట్లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. 11 ఇంచెస్,12.9 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో మోడల్స్ పై రూ. 5,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. టెన్త్ జనరేషన్ ఐప్యాడ్ రూ.4,000 డిస్కౌంట్‌తో లభిస్తుంది. నైన్త్ జనరేషన్ ఐప్యాడ్‌పై రూ.3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ఉంది. అలాగే ఐప్యాడ్ మినీ ధర రూ. 3,000 వరకు తగ్గింది.

ఐఫోన్ డీల్స్

దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ పై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ లభించనుంది. ఇక ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లపై రూ. 6,000 వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. అలాగే ఐఫోన్ 14పై రూ. 4,000 డిస్కౌంట్, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13లపై రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ పై రూ.2,000 డిస్కౌంట్‌ ఉంది.

మ్యాక్‌బుక్‌ ఆఫర్స్

13 ఇంచెస్, 15 ఇంచెస్ యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎమ్‌2 ల్యాప్‌టాప్స్.. దీపావళి సేల్‌లో భాగంగా రూ.10,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో లభించనున్నాయి. 13 ఇంచెస్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 రూ.8,000 క్యాష్‌బ్యాక్‌తో లభిస్తుంది. అయితే ఇదే ప్రొడక్ట్ అమెజాన్‌లో ఇంకా తక్కువకు లభిస్తుంది.

ఈ ఆఫర్లు అన్ని యాపిల్ స్టోర్స్‌కు వర్తిస్తాయి. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు యాపిల్ రిటైల్ స్టోర్లలో కూడా ఈ దీపావళి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Diwali,Diwali Sale 2023,iPhone,iPad,Air Pods
Diwali, Diwali Sale, Diwali Sale 2023, iPhone, iPad, Mac, AirPods, telugu, telugu news, telugu global news, latest news, Apple India Diwali sale, యాపిల్ ప్రొడక్ట్స్‌పై దీపావళి ఆఫర్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌, దీపావళి, ఆఫర్లు, దీపావళి ఆఫర్లు

https://www.teluguglobal.com//business/apple-india-diwali-sale-top-deals-on-iphone-ipad-mac-airpods-revealed-968481