యూజర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్..రెండు కొత్త ప్లాన్స్‌

2025-01-15 04:45:38.0

డేటాను అధికంగా వినియోగించే కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.

డేటాను ఎక్కువ ఉపయోగించే కస్టమర్లకు ప్రభుత్వ రంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆకర్షణీయమైన రెండు సరి కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. బడ్జెట్ ధరలోనే విస్తృతమైన ప్రయోజనాలను అందించింది. ఒక ప్లాన్‌ను 30 రోజుల వ్యాలిడిటీతో, మరో ఆఫర్‌ను 84 రోజుల చెల్లుబాటుతో ప్రవేశపెట్టింది. మార్కెట్‌లో ప్రత్యర్థి కంపెనీలు అందిస్తున్న ఆఫర్లతో పోల్చితే ఈ ప్లాన్ల బెనిఫిట్స్ ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి.

రూ.215 ప్లాన్ వివరాలు ఇవే

ఈ ప్లాన్ వ్యాలిడిటీ వన్ మంత్ ఉంటుంది. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. లిమిట్ అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ తగ్గిపోతుంది. ఇక, అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు.

రూ. 628 ప్లాన్ వివరాలు ఇవే

ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు ఏకంగా 3జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 84 రోజులకు కలిపి మొత్తం 252జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్‌, దేశమంతటా ఉచిత రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. టెలికం మార్కెట్‌లో విభిన్న కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్లను ప్రకటించింది.

BSNL,users,telecom company,new plans,BSNL Offers Recharge Offers Business News,PM Modi