యూట్యూబర్‌ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదు

https://www.teluguglobal.com/h-upload/2024/09/25/1362720-harsha-sai.webp

2024-09-25 03:44:55.0

తనపై లైంగికదాడికి పాల్పడి, న్యూడ్‌ చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్‌ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు

యూట్యూబర్‌ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై లైంగికదాడికి పాల్పడి, న్యూడ్‌ చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్‌ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చింది. ఓ రియాల్టీ షోలో పాల్గొన్నది. ఒక ప్రైవేట్‌ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. యువతిని పోలీసులు కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తరలించారు. హర్షసాయి తండ్రిపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థికసాయం చేస్తూ.. వీడియోలు తన ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. అతను హీరోగా, బాధిత యువతి హీరోయిన్‌గా గతంలో ఒక సినిమా ప్రారంభించారు.

Rape Case,Registered,Against Youtuber Harsha Sai