https://www.teluguglobal.com/h-upload/2024/10/04/1365831-harsha-sai.webp
2024-10-04 03:33:41.0
సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు
యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. హర్షసాయి ఉద్దేశపూర్వకంగానే ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలు పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యూట్యూబర్ హర్షసాయిపై ఇటీవల అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, తన న్యూడ్ చిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశాడని ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Another Case,Registered,Youtuber Harsha Sai