యూట్యూబర్‌ హర్షసాయిపై లుక్‌ఔట్‌ నోటీసులు

https://www.teluguglobal.com/h-upload/2024/10/05/1366324-harsha-sai.webp

2024-10-05 07:51:51.0

పరారీలో ఉన్న అతని కోసం పోలీసుల గాలింపు

యూట్యూబర్‌ హర్షసాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతనిపై నార్సింగ్‌ పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైంది. తనపై లైంగిక దాడి చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేశాడని ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు యూట్యూబర్‌ హర్షసాయిపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. సోషల్‌ మీడియాలో తనపై ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్షసాయి ఉద్దేశపూర్వకంగానే ట్రోలింగ్‌ చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలు పలు స్క్రీన్‌ షాట్లను పోలీసులకు అందించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Lookout Notices,On YouTuber Harsha Sai,Narsingi Police,sexually assaulted