యూట్యూబర్ హర్ష సాయికి బెయిల్

 

2024-10-30 11:35:11.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/30/1373903-harsha.webp

యువతిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజురు చేస్తూ తీర్పునిచ్చింది. ఓ మహిళ నటి హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీసులకు పిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా హర్షసాయి ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. నేడు ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయికి ఓ పార్టీలో ముంబైకి చెందిన నటి పరిచయమయ్యారు.

ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన హర్షసాయి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని బాధిత యువతి తెలిపింది. సెప్టెంబర్ 24న పోలీసులు కేసు నమోదు చేయగా.. అప్పటి నుంచి హర్ష సాయి పరారీలోనే ఉండటం గమనార్హం. దీంతో.. పోలీసులు హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. బాధిత యువతితో హర్షసాయి కలిసి ఓ సినిమాలో నటించడంతోపాటు ఆ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. 

 

Harsha Sai,YouTuber,Bail,sexual assault,Nursing Police,Telangana High Court,Mumbai actress