యూనస్‌తో భేటీ అయిన జార్జి సోరస్‌ కుమారుడు

2025-01-30 07:18:54.0

ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన కీలక వ్యక్తులు చీఫ్‌ ఇంటీరియం అడ్వైజర్‌తో భేటీ అయ్యారని యూనస్‌ ఆఫీస్‌ ఎక్స్‌లో పోస్టు

వివాదాస్పద అమెరికన్ బిలియనీర్, ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధినేత జార్జి సోరస్‌ కుమారుడు అలెక్స్‌ బంగ్లాదేశ్‌ ముఖ్య సలహాదారు మహమ్మద్‌ యూనస్‌తో భేటీ అయ్యారు. ఆ దేశానికి నిధులను నిలిపేస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకొన్నాక ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మూడు నెలల వ్యవధిలోనే వీరిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి.ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన కీలక వ్యక్తులు చీఫ్‌ ఇంటీరియం అడ్వైజర్‌తో భేటీ అయ్యారని యూనస్‌ ఆఫీస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలని, అసత్య ప్రచారాలతో ఎలా పోరాడాలో, కీలక ఆర్థిక సంస్కరణలు వంటి అంశాలపై చర్చించారు. అని యూనస్‌ ఆఫీస్‌ పేర్కొన్నది. వీటితోపాటు రోహిగ్యా సంక్షోభం వంటి వాటిపైనా మాట్లాడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది.

సోరస్‌కు చెందిన ఓఎస్‌ఎఫ్‌ తూర్పు ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మార్పిడిన ప్రోత్సహించినట్లు ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వ పథనంలోనూ కీలకపాత్ర పోషించారనే ప్రచారం ఉన్నది.

Alex Soros,Son of George Soros,Met,Bangladesh Interim leader Muhammad Yunus