యూనిఫామ్‌ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉన్నది

2025-01-31 08:23:23.0

పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు

https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399115-dwaraka-tirumal-rao.webp

ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు.. యూనిఫామ్‌ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉన్నది. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు చూశాను. సంప్రదాయ పోలీసింగ్‌ నుంచి సాంకేతిక పోలీసింగ్‌ వైపు మారాం. సైబర్‌ క్రైమ్‌, గంజా యి, చిన్నారులపై నేరాల విషక్ష్మీంలో చర్యలు చేపట్టామన్నారు. విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని వివరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. తిరుమలరావు పోలీస్‌ శాఖలో చెరగని ముద్రవేశారని కొనియాడారు. ప్రజల భద్రత, సేఫ్టీ కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్‌ టీమ్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.