యూపీఐ లైట్‌ నుంచి త్వరలో ‘విత్‌ డ్రా’ ఆప్షన్‌

https://www.teluguglobal.com/h-upload/2025/02/26/500x300_1406889-upi-lite.webp

2025-02-26 06:26:00.0

ఖాతాలో డబ్బులు జమ చేసే సదుపాయం మాత్రమే ఉన్నది. ఉపసంహరించుకొనే అవకాశం లేకపోవడంతో ఈ ఆలోచన

చిన్నమొత్తాల్లో చేసే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన యూపీఐ లైట్‌ సేవలు వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ఈ సేవలను మరింత మెరుగుపరచడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ ) సిద్ధమైంది. ఇప్పటివరకు అందుబాటులో లేని బ్యాలెన్స్‌ ‘విత్‌ డ్రా’ ఆప్షన్‌ను యూపీఐ లైట్‌లో తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఎలాంటి పిన్‌ ఎంటర్‌ చేయకుండానే యూపీఐ పేమెంట్స్‌ చేయడానికి యూపీఐ లైట్‌ సేవలు సహకరిస్తాయి. ఇది ‘వన్‌ వే’ సేవ. అంటే ఈ ఖాతాలో డబ్బులు జమ చేసే సదుపాయం మాత్రమే ఉంటుంది. దాన్ని ఉపసంహరించుకొనే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ అకౌంట్‌లోనిధుల్ని ఉపసంహరించుకోవాలనుకుంటే యూపీఐ లైట్‌ ఖాతాను నిలిపివేయాల్సిందే. మరో మార్గం లేదు. ఇకపై ఆ సమస్య లేకుండా సొమ్మును విత్‌ డ్రా చేసుకునే సదుపాయం రానున్నది. త్వరలో ఈ సేవను తీసుకురావడానికి ఎన్‌పీసీఐ సిద్ధమౌతున్నది. నగదు విత్‌ డ్రాకు వీలు కల్పించాలని పేర్కొంటూ బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖ రాసింది. మార్చి 31 నాటికి నగదు విత్‌ డ్రా కోసం ‘ట్రాన్స్‌ఫర్‌ అవుట్‌’ ఆప్షన్‌ అందుబాటులోకి రానున్నదని సమాచారం. 

UPI Lite account,Soon withdraw option,Balance from NPCI,PSPs to add this feature

https://www.teluguglobal.com//science-tech/withdraw-option-from-upi-lite-1115892