https://www.teluguglobal.com/h-upload/2024/10/04/1365834-accident.webp
2024-10-04 03:21:44.0
ట్రాక్టర్, ట్రక్కు ఢీకొని 10 మంది కూలీల దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ట్రక్కు ఢీకొని 10 మంది కూలీలు దుర్మరణం చెందారు. యూపీలోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 13 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా పని పూర్తిచేసుకుని వారణాసిలోని స్వగ్రామం మిజామురాద్‌కు వస్తున్నట్లు తెలిపారు. ట్రక్కు అదుపు తప్పి ట్రాక్టర్ వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి బనారస్ హిందూ యూనివర్సిటీ ట్రామా సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు.
‘అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కచ్వా సరిహద్దు జిటి రోడ్‌లో ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. 13 మందితో వారణాసి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొట్టింది. 13 మందిలో 10 మంది అక్కడికక్కడే మరణించారు” అని మిర్జాపూర్ పోలీసు సూపరింటెండెంట్ అభినందన్ కుమార్ సింగ్ తెలిపారు.
10 Labourers Killed,Truck-Tractor Collision. UP,Mirzapur,3 Injured