2024-11-03 09:22:35.0
పదిరోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే బాబా సిద్ధిఖీ లాగా చంపుతామంటూ హెచ్చరిక
https://www.teluguglobal.com/h-upload/2024/11/03/1374490-cm-yogi.webp
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వెళ్లింది. బాబా సిద్ధిఖీ లాగా యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామంటూ దుండగులు హెచ్చరించారు. ఆయన పదిరోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలని మెసేజ్‌లో డిమాండ్ చేశారు. శనివారం ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ వెళ్లినట్లు సమాచారం. ఈ మెసేజ్ పంపిన వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మెసేజ్ పంపింది ఫాతిమా అని గుర్తించారు. ఆమె మంచి విద్యార్హతలు ఉన్నాయని, తనకు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ ముంబాయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ వెళ్లగా.. నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
UP CM Yogi Adityanath,Receives,Death Threat,Resign or Face ‘Siddique’s Fate